కాంగ్రెస్’కు గుండుగీస్తారా.. !?
కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలు గుండుగీశారానే ప్రచారం జరుగుతోంది. లోక్ సభ ఎన్నికలో ఆ పార్టీ కనీసం ఆరు స్థానాల్లో విజయం సాధించాలనే టార్గెట్ ని పెట్టుకొంది. అందుకోసం సీనియర్లు రంగంలోకి దిగారు. విభిన్నంగా ప్రచారం చేశారు. ప్రశ్నించే గొంతుక ఉండాలని.. తమని గెలిపించాలని ఓటర్లని వేడుకొన్నారు. అయినా.. వారి మాటలు తెలంగాణ ప్రజలకి ఎక్కలేదని తాజా సర్వే ఫలితాలు చెబుతున్నాయి. తెలంగాణలో కారుకు పదహారు సీట్లు పక్కా అంటున్నాయి. ఎంఐఎంకు ఒక్కసీటు అనుమానంలేదంటున్నారు.
మరీ.. తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి ఏంటీ ? అంటే.. ఆ పార్టీ ఒకటి నుంచి రెండు సీట్లు గెలుచుకోవచ్చు. అంతేకాదు.. కాంగ్రెస్ కి ప్రజలు గుండుగీసిన ఆశ్చర్యపోవాల్సిన పనిలేదంటున్నారు. ఆ పార్టీ కచ్చితంగా గెలవబోతుందన్న స్థానాల్లో మల్కాజిగిరి నుంచి రేవంత్ రెడ్డి, భువనగిరి నుంచి కోమట్ రెడ్డి వెంకట్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. వీరిద్దరిపైనే కాంగ్రెస్ ఆశలు. లేదంటే.. గుండుసున్నాయే. అది జరిగితే.. తెలంగాణలో కాంగ్రెస్ ఇజ్ఝత్ పోయినట్టే. అప్పుడు ఆ పార్టీ మొత్తాన్ని తెరాసలో విలీనం చేస్తారేమో.. !