దేవిశ్రీ వారసొడొచ్చాడు.. !

టాలీవుడ్ ని ఏలుతున్న సంగీత దర్శకుల్లో దేవిశ్రీ ప్రసాద్ ఒకరు. ఇటీవలే ‘మహర్షి’ సినిమాతో విజయం అందుకొన్నారు. ఈ సినిమా నేపథ్య సంగీతంలో దేవి మేజిక్ కనిపించింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రాబోతున్న మహేష్ సినిమాకి కూడా దేవిశ్రీ ప్రసాద్ నే సంగీతం అందించబోతున్నారు. ప్రస్తుతం దేవి చేతిలో అరడజనుకు పైగా సినిమాలున్నాయి.

చాలా చిన్న వయసులోనే సంగీత దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన సంగీత ప్రపంచంలో స్టార్ గా ఎదిగాడు. ఇప్పుడు దేవికి వారసుడు కూడా వచ్చాడు. ఆయన అల్లుడు అద్భుతంగా డ్రమ్స్ వాయిస్తున్నాడు. దానికి సంబంధించిన వీడియోని దేవి తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఇంతకీ బుడ్డోడు వయసెంతో తెలుసా.. ? జస్ట్ 2.5 ఇయర్స్. నా అల్లుడు నన్నే సప్రైజ్ చేశాడని కామెంట్ పెట్టాడు దేవి. ఆ వీడియోని మీరు చూసేయండీ.. !