కోడలి పిల్లతో మజా వస్తోందట !

రెండో మన్మథుడు రెడీ అవుతున్నాడు. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నాగార్జున-రకుల్ ప్రీత్ సింగ్ జంటగా ‘మన్మథుడు2’ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో సమంత కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆమె ఇప్పటికే షూటింగ్ లో జాయిన్ అయ్యారు. దీంతో కోడలితో దిగిన చక్కని ఫోటోని నాగార్జున తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘కోడలిపిల్లలో కలిసి షూటింగ్ ఆనందంగా ఉంది. చాలా సరాదాగా సాగిపోతుంది’ అంటూ కామెంట్ పెట్టాడు నాగ్. ఫోటోలో మామ-కోడళ్లు హ్యాపీగా నవ్వుతూ కనిపిస్తున్నారు.

త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన నాగార్జున ‘మన్మథుడు’ సూపర్ హిట్ అయింది. నాగ్ కెరీర్ లో స్పెషల్ చిత్రంగా నిలిచింది. ఈ చిత్రానికి రిమేక్ గా మన్మథుడు2ని భావిస్తున్నారు. ఐతే, మన్మథుడు సినిమా స్టోరీలైన్ కి సీక్వెల్ రివర్స్ లో ఉంటుందని తెలుస్తోంది. ఇందులో నాగ్ తన ఆఫీసులో పనిచేసే అమ్మాయిల పట్ల జాగ్రత్తగా ఉంటారట. ప్రేమగా చూసుకొంటారట. అలా ఎందుకనేది సమంత పాత్రతో ఫ్లాష్ బ్యాక్ ఉంటుందని చెబుతున్నారు. రెండో మన్మథుడు కూడా వినోద్మాత్మకంగా ఉండబోతున్నాడని తెలిసింది.

ఈ చిత్రానికి ఆగస్టు 29న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారమ్. ఆ తర్వాతి రోజే అంటే ఆగస్టు 30న నాని గ్యాంగ్ లీడర్ రాబోతుంది. ఈ నేపథ్యంలో మన్మథుడు ఓ వారం ముందుకు లేదంటే వెనక్కి జరిగే అవకాశాలున్నాయి.