భాజాపా విందు రాజకీయాలు

ఎగ్జిట్ పోల్స్ బీజేపీలో ఆనందం నింపింది. ఈ ఆనందంలో ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా విందు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఎన్డీయే పక్షాలతో పాటు ప్రధాని నరేంద్ర మోడీ కూడా హాజరుకాబోతున్నాయి. ఎన్నికల్లో సహకరించినందుకు ఎన్డీయే పక్షాలకి షా కృతజ్ఝతలు చెప్పనున్నారు. అదే సమయంలో ఎన్నికల ఫలితాల తర్వాత అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు.

మరోవైపు, విపక్ష పార్టీలని ఈరోజు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవబోతున్నాయి. ఓట్ల లెక్కింపు సందర్భంగా వీవీప్యాట్లనే మొదట లెక్కించి తర్వాత ఈవీఎంలను లెక్కించాలని.. ఈవీఎం, వీవీప్యాట్లలో నమోదైన ఓట్ల మధ్య తేడాలుంటే నియోజకవర్గంలోని మొత్తం వీవీప్యాట్లను లెక్కించాలని ఈసీని కోరనున్నట్లు చంద్రబాబు తెలిపారు. అవసరమైతే.. ఈసీ ముందు ధర్నాకి దిగాలని విపక్షాలు ప్లాన్ చేసుకొన్నట్టు సమాచారమ్. మొత్తానికి.. ఢిల్లీలో ఇవాళ రెండు కీలక సమావేశాలు జరగనున్నాయి.