ఏపీకి కొత్త నిర్వహించిన చెప్పిన దేవినేని
ఏపీకి కొత్త నిర్వచనం చెప్పారు మంత్రి దేవినేని ఉమ. ‘ఏ’ ఫర్ అమరావతి, ‘పి’ ఫర్ పోలవరం అన్నారు దేవినేని. ఈ ఉదయం దేవినేని విజయవాడలో మీడియాతో మాట్లాడారు. అమరావతిని భ్రమరావతి అన్న జగన్.. ఎలా గెలుస్తారు. ఏం చూసి ప్రజలు జగన్ కు ఓటేస్తారని దేవినేని ప్రశ్నించారు. రాష్ట్రంలో 62 ప్రాజెక్టుల పనులు కొనసాగుతున్నాయన్నారు.
2014లో రాష్ట్రం ఏమైపోతుందో అనే భయంతో ప్రజలు తెదేపాకు ఓటేశారు. 2019తో తెదేపాను గెలిపిస్తేనే రాష్ట్ర భవిష్యత్తు అనే బాధ్యతతో ఓటేశారన్నారు దేవినేని. ఈనెల 23న వెలువడే ఫలితాలతో ఆంధ్రాలో తాము సంబరాలు చేసుకొంటామని ధీమా వ్యక్తం చేశారు. జగన్ భ్రమల్లో బతుకుతున్నారు. 2014లోనూ జగన్ కు ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. కానీ, అది జరగలేదు. ఈ సారి అంతే అన్నారు.