‘హీరో’ ఒక్క సీన్ కోసం అన్నీ కోట్లా.. !
కొత్త దర్శకుడు ఆనంద్ అన్నామలై దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటిస్తున్న చిత్రం ‘హీరో’. మాళవికా మోహనన్ కథానాయిక. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. తెలుగుతోపాటు తమిళం, కన్నడ భాషల్లోనూ చిత్రం విడుదల కాబోతోంది. ఇందులో విజయ్ ప్రొఫెషనల్ బైకర్ పాత్రలో నటిస్తున్నట్లు తెలిసింది. ఈ సినిమా షూటింగ్ ఇటీవల ఢిల్లీలో ప్రారంభమైంది. అక్కడ బైక్ స్టంట్ ఒకటి చిత్రీకరిస్తున్నారు. ఈ ఒక్క స్టంట్ కోసం ఏకంగా రూ. 8కోట్లు ఖర్చుపెడుతున్నట్టు సమాచారమ్.
మరోవైపు, కొత్త దర్శకుడు భరత్ కమ్మ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ-రష్మిక మందన జంటగా నటించిన చిత్రం డియర్ కామ్రేడ్. జులై 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. దక్షిణాదిన అన్నీ బాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. ట్రైలర్ ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా హిట్ అయితే.. విజయ్ దేవరకొండ సౌత్ యూత్ మెగాస్టార్ గా అయిపోవడం ఖాయమని చెప్పవచ్చు. ఈ సినిమా తర్వాత కూడా విజయ్ తన సినిమాలన్నీ సౌత్ బాషలన్నింటిలో విడుదల చేసేందుకు ప్లాన్ చేసుకొంటున్నట్టు కనబడుతోంది.