ప్రత్యర్థి ఎవరైనా.. లక్ష్యం ఒక్కటే : విరాట్
వరల్డ్ కప్ గెలుపే లక్ష్యం అంటున్నాడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. వరల్డ్ కప్ కోసం ఇంగ్లాండ్ బయల్దేరడానికి ముందు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, కోచ్ రవిశాస్త్రి మంగళవారం ముంబైలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కోహ్లి మాట్లాడుతూ.. ప్రత్యర్థి ఎవరనేది మేటర్ కాదు. మాలోని అత్యత్తమ ప్రదర్శనని బయటికి తీయడమే లక్ష్యం అన్నారు.
వరల్డ్ కప్ లో ఒత్తిడిని అధిగమించడమే ముఖ్యం. ప్రతి మ్యాచ్‌లో అత్యుత్తమ క్రికెట్ ఆడటంపైనే ఫోకస్ పెట్టాలి. ఇక, ఐపీఎల్ లో ఫామ్ కోల్పోయిన స్పిన్నర్ కులదీప్ యాదవ్ పై కోహ్లీ నమ్మకం ఉంచారు. కుల్దీప్, చాహల్ వరల్డ్ కప్‌లో రెండు స్తంభాలన్నారు. ధోని మా పెద్ద బలం. జాదవ్ గాయపడటంపై ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు కోహ్లీ. మొత్తానికి.. సమరానికి బయలుదేరే ముందు కాన్ఫిడెంటుగా కనిపించాడు కోహ్లీ. మరీ.. కప్ తో తిరిగొస్తాడా.. ? అన్నది చూడాలి.