ఆనందంతో.. తనయుడుకి మహేష్ ముద్దు !

మహర్షి హిట్ తో సూపర్ స్టార్ మహేష్ బాబు ఆనందంలో మునిగితేలుతున్నారు. ఎప్పుడూ లేని విధంగా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు. వరుస సక్సెస్ మీట్స్, థియేటర్స్ సందర్శన, స్కూళ్లు, కాలేజీలు చుట్టేశారు. చివరగా విజయవాడలో మహర్షి విజయోత్సవ సభని ఘనంగా నిర్వహించి.. ఘన విజయాన్ని అందించినందుకు అభిమానులకి ధన్యవాదాలు తెలిపారు.

తాజాగా తనయుడు గౌతమ్ కృష్ణతో కలిసి మహర్షి సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు మహేష్. గౌతమ్ ని ముద్దాడుతున్న ఫోటో ఒకటి తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు మహేష్. హ్యాపీనెస్, సెలబ్రేటింగ్ మహర్షి అనే ట్యాగ్ లైన్స్ ఇచ్చాడు. ఇప్పుడీ పిక్ సూపర్ స్టార్ అభిమానులని ఆకట్టుకుంటోంది. ఇక, అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేశ్ తదుపరి సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.