రకుల్ తీరని కోరిక.. !
హీరోయిన్స్ కడుపుకట్టుకొని కష్టపడుతుంటారు. తింటే ఎక్కుడ బరువు పెరగుతామోనని భయపడిపోటుంటారు. తినాలని ఉన్నా.. తినలేరు. అందుకే తిండి విషయంలో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తీరని కోరిక ఒకటి కోరుకొంది. ‘నేను బాగా తినాలి.. కానీ బరువు పెరగకూడదు’ అంటోంది. ఆమె నటించిన బాలీవుడ్ చిత్రం ‘దే దే ప్యార్ దే’ ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చి హిట్ టాక్ తెచ్చుకొంది.
ఈ చిత్రం కేవలం నాలుగు రోజుల్లో దేశవ్యాప్తంగా రూ.44.73 కోట్లు రాబట్టింది. మరోపక్క కోలీవుడ్‌లో సూర్య సరసన రకుల్ నటించిన ‘ఎన్జీకే’ సినిమా మే 31న విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో రకుల్ ట్విటర్ వేదికగా నెటిజన్లతో ముచ్చటించారు. మీ కోరికల్లో ఒకటి చెప్పండని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు.. ‘నేను బాగా తినాలి.. కానీ బరువు పెరగకూడదు’అని సమాధానమిచ్చింది రకుల్. అది నిజంగా తీరని కోరికే. అన్నట్టు.. ఇంతవరకు రకుల్ కి ఎవరు ప్రపోజ్ చేయలేదట.