గ్రేట్ : 100 కేజీలు లిఫ్ట్ చేసిన సమంత
స్టార్ హీరోయిన్ సమంత ఫిట్ నెస్ కి అత్యధిక ప్రాధాన్యం ఇస్తారు. ఇప్పటికే అనేక సార్లు సామ్ వ్యాయామశాలలో కసరత్తులు చేస్తుండగా తీసిన వీడియోలు, ఫొటోలను షేర్ చేశారు. అవి ఆమె అభిమానులని సప్రైజ్ చేశాయి. తాజాగా ఆమె 100 కిలోలతో స్క్వాట్స్ చేశారు. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేశారు. దీన్ని చూసి..ఆశ్చర్యపోవడం నెటిజన్ల వంతు అయ్యింది.
సినిమాల విషయానికొస్తే.. పెళ్లి తర్వాత సమంత వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకొంటున్నారు. ఇటీవల సామ్ ‘మజిలీ’ సినిమాతో మంచి హిట్ అందుకున్నారు. ఆమె నటించిన ‘ఓ బేబీ’ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకొంటోంది. ఈ సినిమా మాములుగా ఉండదని చెబుతోంది. మంగళవారం ఈ సినిమా నుంచి కొత్త పోస్టర్ ని ప్రేక్షకులతో పంచుకొంది సామ్. ఇందులో సామ్ క్యూట్ గా కనిపిస్తున్నారు.