కౌంటింగ్ టైం.. అధినేతలు ఎక్కడ ?

ఎన్నికల ఫలితాలపై అంచనాలు, అపోహలు తొలగిపోయే టైం వచ్చేసింది. కౌంటింగ్ టైం మరికొన్ని నిమిషాల్లో ప్రారంభం కాబోతుంది. మరీ.. కౌంటింగ్ సరళీని పర్యవేక్షించేందుకు పార్టీ అధినేతలు ఎక్కడికి చేరుకొన్నారు. ఏయే ఏర్పాట్లు చేసుకొన్నారనేది ఆసక్తిగా మారింది. వైకాపా అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. అక్కడి నుంచే ఓట్ల లెక్కింపు సరళిని సమీక్షించనున్నారు. జగన్ సతీమణి వైఎస్‌ భారతి, పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ కూడా ఇక్కడికే చేరుకోనున్నారు.

జనసేన అధినేత పవన్ కల్యాణ ఎక్కడి నుంచి కౌంటింగ్ సరళీని పర్యవేక్షిస్తారన్న విషయంలో క్లారిటీ లేదు. ఆయన పార్టీ ఆఫీసుకు వస్తారా.. ? అన్నది సొంత పార్టీ నేతలే చెప్పలేకపోతున్నారు. ఐతే, జనసేన ఆఫీసులో కౌంటింగ్ సరళీని పర్యవేక్షిచేందుకు ఏర్పాట్లు చేశారు. ఇక, ఏపీ సీఎం చంద్రబాబు అమరావతిలో తన నివాసం నుంచి కౌంటింగ్ సరళీని పర్యవేక్షించబోతున్నారు. తెరాస అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ ఇంటి నుంచే కౌంటింగ్ సరళీని పర్యవేక్షిస్తున్నారని తెలిసింది.