‘బీజేవైఎం’కు తేజ వార్నింగ్
భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం)కు దర్శకుడు తేజ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తేజ తాజా చిత్రం ‘సీత’ టైటిల్ పై బీజేవైఎం అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. సీత టైటిల్ తో బూతుపురాణం ఏంటని ప్రశ్నించారు. సీత టైటిల్ మార్చాలి. అభ్యంతరక డైలాగ్స్ ని తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై కోర్టుకు వెళ్లే ఆలోచనలోనూ బీజేవైఎం నేతలు ఉన్నారు.
తాజాగా బీజేవైఎం హెచ్చరికలపై చిత్ర దర్శకుడు తేజ స్పందించారు. “సీత సినిమాకు సీత అని కాకుండా శూర్పనక అని పెట్టాలా? ఎందుకు మార్చాలి టైటిల్?? నేను మార్చను. సీత సినిమా ఇట్లాగే ఉంటది. అలాగే ఎవ్వరికీ చూపించం. ఇలాగే రిలీజ్ చేస్తా. సినిమా సెన్సార్ అయింది. నేనెవ్వరికీ చూపించాల్సిన అవసరం లేదు. ఎవడొస్తాడో చూసుకొంటా. సినిమా ఈ నెల 24 పొద్దున 11గంటలని రిలీక్ అవ్వబోతుంది. ఎవడుఆపుతాడో చూసుకొంటా” అంటూ వార్నింగ్ ఇచ్చారు తేజ. ఈ మేరకు ఓ వీడియోని తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశాడు.
#Sita releases on 24th May come what may… pic.twitter.com/APAEXcxZIC
— Teja (@tejagaru) May 22, 2019