జగన్ దాడి కేసు : నిందితుడు శ్రీనివాస్ రెడ్డి బెయిల్ మంజూరు
వైకాపా అధినేత వైఎస్ జగన్ దాడి కేసు నిందితుడు శ్రీనివాస్ బెయిల్ మంజూరైంది. ఎన్ఐఏ కోర్టు శ్రీనివాస్ కు బెయిల్ మంజూరు చేసింది. రూ.30వేల నగదు, ఇద్దరి పూచీకత్తుపై కోర్టు బెయిలు మంజూరు చేసింది. రేపు సాయంత్రం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి శ్రీనివాస్ విడుదల కానున్నాడు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైకాపా ఘన విజయం సాధించిన సమయంలోనే.. నిందితుడు శ్రీనివాస్ రెడ్డికి బెయిల్ మంజూరు కావడం విశేషం. దీని వెనక ఏదైనా రాజకీయ ఒత్తిడి ఉందా అనేది తెలియాల్సి ఉంది.