చంద్రబాబు, కేసీఆర్ కంటే జగన్ పవర్ ఫుల్ !

ఇన్నాళ్లు ఒక లెక్క. ఇకపై ఒక లెక్క. సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత పొలిటికల్ పార్టీల ప్రధాన్యతలు పూర్తిగా మారనున్నాయి.
కేంద్రంలో చక్రం తిప్పాలని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులిద్దరు ఆరాటం చూపించారు. ఇందుకోసం ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత కూడా ప్రయత్నాలు చేశారు. ఐతే, చంద్రబాబు, కేసీఆర్ ల కంటే జగన్ కేంద్రంలో పవర్ ఫుల్ గా మారబోతున్నట్టు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఏపీలో వైకాపా 18నుంచి20 ఎంపీ స్థానాలు గెలుచుకోబోతుందని సర్వేలు చెబుతున్నాయి.

అదే జరిగితే.. కేంద్రంలో అతిపెద్ద రెండో పార్టీగా వైకాపా అవతరించబోతుంది. దీనికితోడు.. వైకాపాకు రెండు జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ లతో ఎలాంటి సమస్య లేదు. ఎందుకంటే ? ఏపీలో రెండు జాతీయపార్టీల ప్రాబల్యం పెద్దగా లేదు. ఈ నేపథ్యంలో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే పార్టీతో జగన్ కలవొచ్చు. చంద్రబాబు, కేసీఆర్ లకి ఆ అవకాశం లేదు.

బీజేపీకి బద్ద శత్రువుగా మారాడు ఏపీ సీఎం చంద్రబాబు. కేంద్రంలో బీజేపీని గద్దె దించేందుకు దేశం అంతా కాళ్లరిగేలా తిరిగి విపక్ష పార్టీలని ఏకం చేసే పనిలో ఉన్నారు. ఐతే, చంద్రబాబు ప్రయత్నం ఫలించకపోవచ్చని సర్వేలు చెబుతున్నాయి. మరోసారి కేంద్రంలో ఎన్ డీయే దే అధికారం అంటున్నాయి. ఇక, తెరాస కాంగ్రెస్ తో కలిసే అవకాశాలు తక్కువ. తెలంగాణలో తెరాస ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ నే. ఈ నేపథ్యంలో చంద్రబాబు, కేసీఆర్ ల కంటే జగన్ కేంద్రంలో పవర్ ఫుల్ గా మారబోతున్నాడని చెబుతున్నారు.