కవితక్క ఓటమి.. తట్టుకోవడం కష్టమే !

ఈసారి కారు జోరు తగ్గింది. సగం స్వీడులోనే దూసుకెళ్లింది. తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో తెరాస 16స్థానాలని గెలుచుకోవడమే లక్ష్యంగా పెట్టుకొంది. ‘కారు సారు పదహారు’ అనే స్లోగన్ తో ప్రచారం నిర్వహించింది. ఎగ్జిట్ పోల్స్ కూడా కారుకు పదహారు సీట్లు రావడం దాదాపు ఖాయమనే చెప్పాయి. ఐతే, ఎగ్జాట్ ఫలితాలు అందుకు భిన్నంగా వచ్చాయి. తెరాస సగం మాత్రమే సక్సెస్ అయింది. 16స్థానలని టార్గెట్ గా పెట్టుకొంటే.. 9స్థానాల్లో మాత్రమే గెలిపొందింది. కాంగ్రెస్ 3, బీజేపీ 4, ఎంఐఎం ఒకస్థానంలో గెలుపొందాయి.

తెరాస16 టార్గెట్ మిస్సవడం కంటే.. నిజామాబాద్ లో కవిత ఓడిపోవడం ఎక్కువగా బాధిస్తోంది. ఇన్నాళ్లు కవిత తెలంగాణ ఆడపడుచులకి బ్రాండ్ అంబాసిడర్ ఉండేది. బతకమ్మ, బోనాలు పండగ సందర్భంలో ఆమె మొహం వెలిగిపోయేది. ఐతే, తాజా ఓటమితో ఆమె మోము చిన్నపోయింది. ఐతే, ఓటమిపై కవిత గానీ, ఆయన తండ్రి, సీఎం కేసీఆర్ గానీ స్పందించలేదు. కేటీఆర్ కూడా సోదరి ఓటమిపై పెదవి విప్పలేదు. తెరాసకి సీట్లు తగ్గాయనే బాధకంటే కవిత ఓడిపోయిందనే బాధ కేసీఆర్, కేటీఆర్ లలో ఉండన్నది తెరాస వర్గాలు చెబుతున్నాయి. నిజామాబాద్ లో 175స్థానాల్లో రైతులు పోటీ చేయడం కవిత ఓటమికి ప్రధాన కారణంగా తెలుస్తోంది.