బ్రేకింగ్ : లగడపాటి కనబడటం లేదు

ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ అజ్ఝాతంలోకి వెళ్లినట్టు సమాచారమ్. ఆయన కనబటం లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఏపీ అసెంబ్లీ ఎన్నికల విషయంలో లగడపాటి సర్వే తుస్సమంది అన్న విషయం.. తాజా ఫలితాల ట్రెండ్స్ ని చూస్తే అర్థమవుతోంది. రెండో రౌండ్ పూర్తయ్యేవరకు ఏపీలో వైకాపా 137స్థానాల్లో, తెదేపా 29స్థానాల్లో, జనసేన ఒక్క స్థానంలో ఆధిక్యంలో ఉంది.

ఈ నేపథ్యంలో లగడపాటి సర్వే తప్పుల తడక అని తేలిపోయింది. ఏపీలో వచ్చేది వైకాపా ప్రభుత్వమేనని జాతీయ సర్వేలన్నీ మొరపెట్టుకొన్నాయి. అందుకు భిన్నంగా లగడపాటి పచ్చ డబ్బుకొట్టారు. తెదేపా 100స్థానాల్లో విజయం సాధిస్తుంది. మరోసారి అధికారంలోకి వస్తుందని లగడపాటి వాదించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ లగడపాటి సర్వే తప్పింది.

ఇప్పుడు ఏపీ విషయంలోనూ అదే జరిగింది. ఈ నేపథ్యంలో లగడపాటి సర్వేలకి రిటైర్మెంట్ ప్రకటించాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఇప్పటికే లగడపాటి రాజకీయాలకి దూరంగా ఉంటున్నారు. ఇకపై తన హాబీ అయిన సర్వేలకి దూరంగా ఉండాల్సిన పరిస్థితి. లగడపాటి సర్వేను ఆధారంగా తీసుకొనే.. మరోసారి అధికారంలోకి వస్తామని ఏపీ సీఎం చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. ఐతే, లడగపాటిని నమ్ముకొన్న చంద్రబాబుకి చేదు అనుభవం తప్పలేదని ఫలితాల ట్రెండ్ ని బట్టీ అర్థం అవుతోంది.