కట్టే కాలేవరకు ప్రజలతోనే : పవన్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పొలిటికల్ సినిమా అట్టర్ ప్లాప్ అయింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేపార్టీ ఒక్క సీటుతోనే సరిపెట్టుంది. ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేసిన రెండు స్థానాలు భీమవరం, గాజువాకలోనూ ఓటమి పాలయ్యారు. ఎన్నికల ముందు, తర్వాత కూడా ఏపీలో పవన్ కింగ్, కింగ్ మేకర్ అవుతారనే ప్రచారం జరిగింది. కానీ, అసలు పవన్ ఉనికియే కనబడటం లేదు. దీంతో జనసేన దుకాణం బంద్ అనే ప్రచారం మొదలైంది. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాలపై పవన్ తనదైన శైలిలో స్పందించారు.
“తాను రెండు చోట్ల ఓడిపోయినా.. తమ పార్టీకి చెందినవారు ఒక్కరు కూడా గెలవకపోయినప్పటికీ తుదిశ్వాస వరకు రాజకీయాల్లోనే కొనసాగుతానని పవన్ స్పష్టంచేశారు. ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటానన్నారు. ప్రజా సమస్యలపై పోరాడుతూ వారికి అండగా నిలుస్తామన్నారు. ఇక ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపొందిన వైకాపా, సీఎంగా ప్రమాణస్వీకారం చేయబోతున్న వైఎస్ జగన్‌కు, దేశంలో రెండోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయబోతున్న నరేంద్ర మోదీకి పవన్ శుభాకాంక్షలు తెలిపారు.
#PawanKalyan at PressMeet today ! pic.twitter.com/Fvqfm7hCGr
— Pakka Tollywood (@PakkaTolllywood) May 23, 2019