బ్రేకింగ్ : మోడీ, రాహుల్ వెనకంజ
దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. బ్యాలెట్ ఫలితాల్లో భాజాపా స్పషమైన మెజారిటీ కనబర్చింది. ఆ తర్వాత తొలి తొలిరౌండ్ లోనూ భాజాపా ఆధిక్యంలో దూసుకెళ్తోంది. దేశ వ్యాప్తంగా భాజాపా 262 స్థానాల్లో, కాంగ్రెస్ 76స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తొలుత అమేఠీలో ఆధిక్యంలో ఉండగా.. ప్రస్తుతం వెనుకబడిపోయారు. ప్రధాని మోదీ కూడా వారణాసిలో వెనుకంజలో ఉన్నారు.
కాంగ్రెస్ సీనియర్ నేతలు దిగ్విజయ్ సింగ్(భోపాల్), జ్యోతిరాదిత్య సింధియా(గుణ) కూడా వెనుకంజలో ఉన్నారు. భోపాల్‌లో భాజపా నేత ప్రజ్ఞాసింగ్ ఠాకూర్, హమీర్‌పూర్(హిమాచల్‌ప్రదేశ్)లో భాజపా ఎంపీ అనురాగ్ ఠాకూర్ ఆధిక్యంలో ఉన్నారు. రాయ్‌బరేలీలో సోనియాగాంధీ, వయనాడ్(కేరళ)లో రాహుల్‌గాంధీ ముందంజలో ఉన్నారు. పట్నాసాహిబ్(బిహార్)లో శతృఘ్న సిన్హాపై కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆధిక్యంలో ఉన్నారు. నాగ్‌పూర్‌లో నితిన్ గడ్కరీ, మధురలో హేమామాలిని, ఉన్నావ్‌లో సాక్షి మహరాజ్, లఖ్‌నవూలో రాజ్‌నాథ్ సింగ్, సుల్తాన్‌పూర్‌లో మేనకాగాంధీ, ఫిలిబిత్‌లో వరుణగాంధీ ముందంజలో కొనసాగుతున్నారు.