మోడీకి సూపర్ స్టార్ శుభాకాంక్షలు


భాజాపా ఘన విజయం ఖరారైంది. సార్వత్రిక ఎన్నికల ఫలితాల ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ అయ్యాయి. ఎన్డీయే 348స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీకి శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ మోడీకి శుభాకాంక్షలు తెలిపారు. ‘మీరు సాధించారు. హృదయపూర్వక శుభాకాంక్షలు’ అంటూ రజనీ ట్విట్ చేశారు.

బీజేపీ ఘనవిజయం నేపథ్యంలో సినీ, రాజకీయ ప్రముఖులు మోడీకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. వైకాపా అధినేత, కాబోయే ఏపీ సీఎం వైఎస్ జగన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మోడీకి శుభాకాంక్షలు తెలిపారు. రక్షణశాఖ మంత్రి సుష్మాస్వరాజ్ మోడీని విష్ చేశారు. ఇక, కేంద్రంలో మరోసారి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజారిటీ సాధించడం విశేషం.