ఆ ‘మాట’ జగన్ ని గెలిపించింది !


జగన్ మాటిచ్చాడు. ప్రాణం పోయినా తప్పడు. అది ఆయన రక్తంలోనే ఉంది. జగన్ ని దగ్గర చూసిన వాళ్లు, జగన్ గురించి బాగా తెలిసిన వాళ్లు చెప్పే మాటలివి. ఇప్పుడీ ఆ మాటే జగన్ ని గెలిపించిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఎన్నికలకు ముందు పలువురు వైకాపాలో చేరారు. వారికి గొత్తెమ్మ ఆశలు పెట్టుకుండా.. స్పష్టమైన హామీ ఇచ్చారు. మీడియా ముందు అతిగా మాట్లాడటం, మాట మార్ఛడం చేయలేదు. అదే జగన్ కి కలిసొచ్చింది.

మరోవైపు, మాట మార్చడం, మాట తప్పడం చంద్రబాబుకు అతిపెద్ద మైనస్ గా మారింది. ఏపీ ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు మాట మార్చడాన్ని ఏపీ ప్రజలు గుర్తుపెట్టుకొన్నారు. ఆయనకి అనుకూలంగా ఉన్నప్పుడు మోడీ గొప్పొడు. లేదంటే నీచుడు అన్న విషయాలని ప్రజలు మనసులో పెట్టుకొన్నారు. ఇక, టీడీపీ కాంగ్రెస్ తో కలవడం ఏపీ ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. బాబు తన అవసరానికి ఏదైనా చేస్తాడని ఆయన కాంగ్రెస్ తో కలవడం రుజువు చేసింది. మొత్తానికి.. మాట మీద నిలబడటం జగన్ విజయ రహస్యం అయింది. మాట మార్చడం, మాట తప్పడం చంద్రబాబుకు శాపంగా మారిందని చెప్పవచ్చు.