‘సీత’ మేకింగ్ వీడియో చూశారా.. ?

దర్శకుడు తేజ తాజా చిత్రం ‘సీత’. కాజల్ టైటిల్ పాత్రలో నటించింది. బెల్లంకొండ శ్రీనివాస్‌ కథానాయకుడి పాత్ర పోషించారు. బాలీవుడ్ నటుడు సోనూసూద్‌ ప్రతినాయకుడుగా నటించారు. ‘సీత’ రేపే (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా మేకింగ్ వీడియోని విడుదల చేసింది చిత్రబృందం. షూటింగ్ ఫన్నీగా సాగినట్టు మేకింగ్ వీడియో చూస్తే అర్థమవుతోంది.

వీడియోలో తేజ, శ్రీనివాస్‌, కాజల్‌, సోనూసూద్‌ కలిసి జోకులేసుకుంటూ, నవ్వుకుంటూ కనిపించారు. ఫైట్‌ మాస్టర్‌ కాలికి దెబ్బతగిలినప్పుడు తేజ, కాజల్‌, చిత్రబృందం కలిసి ‘అయ్యో అయ్యో’ అంటూ బాధపడటం, ఇందుకు మాస్టర్‌ ‘ఆపండి’ అని అరవడం ఫన్నీగా ఉన్నాయి. సీత మేకింగ్ వీడియోని మీరు చూసేయండీ.. !