చంద్రబాబు, జగన్’ల తోకలు కట్ చేయాలి
దర్శకుడు తేజ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, జగన్ ల పేర్ల చివరల తోకలని కట్ చేయాలన్నారు. తేజ తాజా చిత్రం ‘సీత’. కాజల్, బెల్లకొండ సాయి శ్రీనివాస్, సోనూసూద్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ వారమే (మే24) సీత ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న తేజ కాస్ట్ ఫీలంగ్ పై తనదైన శైలిలో స్పందించారు.
‘కులం పిచ్చి ఉన్న ఉన్న వాడు తన దృష్టిలో మనిషే కాదు. అంత క్యాస్ట్ ఫీలింగ్ ఉంటే.. వాళ్ల క్యాస్ట్ వాడు పండించింది మాత్రమే తినాలి. పేరు చివర ఇంటి పేరు తగిలించుకోవడం ఏంటీ ? చంద్రబాబు, జగన్ ల తోకలని కూడా కత్తిరించాలి’ అని అభిప్రాయపడ్డారు. అంతేకాదు.. ఎన్టీఆర్ గొప్పనటుడు, నాయకుడు. అలాగని ఆయన కులం వారు గ్రేట్ అంతే ఎలా?. మెగాస్టార్ చిర్రంజీవి కష్టజీవి. మెగాస్టార్ గా ఎదిగారు. అలాగని ఆయన అభిమానులు గ్రేట్ అంటే ఎలా ? అని ప్రశ్నించారు తేజ.’
ఇక తేజ టైటిల్ విషయంలో వివాదం నెలకొంది. సీత టైటిల్ తో అసభ్యకరమైన సంభాషణలు పెట్టడం పట్ల బీజేవైఎం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. టైటిల్ మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై బీజేవైఎం నేతలు కోర్టుని ఆశ్రయించే అవకాశాకాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే.. సీతకు కష్టాలు తప్పకపోవచ్చు.