ఎన్నికల సిబ్బందిపై తేనేటీగల ఎటాక్
సార్వత్రిక ఎన్నికల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. లెక్కింపునకి ఎన్నికల సంఘం అన్నీ ఏర్పాట్లు చేసింది. విజయవాడలో ఎన్నికల సిబ్బందిపై తేనేటీగలు దాడి చేశాయి. విజయనగరం జిల్లా డెంకాడ మండలం జొన్నాడ వద్ద ఉన్న లెండి ఇంజినీరింగ్ కళాశాల లెక్కింపు కేంద్రం ప్రధాన ద్వారం కిటికీలకు ఆనుకుని ఉన్న తేనెటీగల పట్టు కదిలి అక్కడ ఉన్న సిబ్బందిని పరుగులు తీయించాయి.
ఇక, సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాట్ పోల్స్ అవుతాయన్నది ఆసక్తిగా మారింది. కేంద్రంలో మరోసారి ఎన్ డీయే అధికారంలో రాబోతుందని ముందస్తు సర్వేలు చెప్పిన సంగతి తెలిసిందే. ఎన్ డీయే కూటమికి 330 సీట్లు రావొచ్చని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. ఐతే, ముందస్తు సర్వేలు ఫెయిల్ కాబోతున్నాయి. యూపీఏ కూటమి అధికారంలోకి రాబోతున్నాయని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఇక, ఏపీ ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. ఏపీలోవైకాపా, తెదేపాల మధ్య నెక్ టు నెక్ ఫైట్ ఉండబోతుందని చెబుతున్నారు.