బ్రేకింగ్ : ఈ నెల 30న ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం


ఏపీలో వైకాపా గెలుపు దాదాపు ఖాయమైంది. ప్రస్తుతం వెలువడుతున్న ఫలితాల ట్రెండులో ఆ పార్టీ 150 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఈ నేపథ్యంలో వైకాపా శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. అంతేకాదు.. ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణస్వీకారోత్సవానికి ముహూర్తం కూడా ఫిక్సయినట్టు సమాచారమ్. ఈ నెల 30జగన్ సీఎంగా ప్రమాణం చేయబోతున్నట్టు తెలిసింది. 30న ఏకాదశి సందర్భంగా ఆ రోజు ఉదయం 11గంటలకి ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టు తెలుస్తోంది.

ఇక, ఏపీలో జగన్ ప్రభంజనానికి హేమాహేమీలు మట్టికరిచే పరిస్థితి నెలకొంది. పలువురు మంత్రులు వెనకంజలో ఉన్నారు. మంగళగిరిలో మంత్రి నారాలోకేష్ వెనకంజలో ఉన్నారు. మంత్రులు గంటా శ్రీనివాస్, సోమిరెడ్డి వెనకంజలో ఉన్నారు. కుప్పంలోనూ ఏపీ సీఎం చంద్రబాబు గట్టిపోటీ ఎదుర్కొంటున్నారు. తొలుత చంద్రబాబు వెనకపడ్డారు. ఆ తర్వాత ముందంజలోకి వచ్చేశారు. ఐతే, ఈసారి కుప్పంలో చంద్రబాబు మెజారిటీ భారీగా తగ్గేలా కనిపిస్తోంది.