వైకాపా.. సంబరాలు షురు !


ఏపీలో వైకాపా గెలుపు ఇక లాంచనమే. ప్రస్తుతం వెలువడుతున్న ఫలితాల ట్రెండు ప్రకారం వైకాపా 151 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. తెదేపా 23స్థానాల్లో, జనసేన ఒక్కస్థానంలో మాత్రమే ఆధిక్యంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఈరోజు సాయంత్రం రాజీనామా చేయబోతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు, ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణస్వీకారోత్సవానికి ముహూర్తం ఫిక్సయినట్టు సమాచారమ్. ఈ నెల 30న జగన్ ప్రమాణస్వీకారోత్సవం ఉండనుందని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో వైకాపా శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. ఆ పార్టీ అధ్యక్షుడు జగన్‌ను పలువురు నేతలు కలిసి అభినందనలు చెబుతున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని జగన్‌ నివాసానికి వచ్చిన ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆయన్ని కౌగిలించుకొని అభినందనలు తెలిపారు. తన నివాసం నుంచి ఎన్నికల ఫలితాలను టీవీలో వీక్షిస్తున్న జగన్‌తోపాటు పలువురు పార్టీ నేతలు ఉన్నారు. అటు లోక్‌సభ ఎన్నికల్లోనూ వైకాపా దూసుకుపోతుంది. ఇప్పటి వరకూ 23 స్థానాల్లో ఫ్యాన్‌ హవా కొనసాగుతుంది.