ఆయనకి సీత నచ్చలేదట.. !
తేజ ‘సీత’ మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘నేనే రాజు నేనే మంత్రి’ తర్వాత తేజ చేసిన సినిమా ఇది. దీనికి తోడు
‘సీత’ ఈతరం అమ్మాయి. రొమాంటిక్. అగ్రెసివ్ అని టీజర్, ట్రైలర్ లో చూపించారు. ఈ నేపథ్యంలో ‘సీత’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలు సీత అందుకుంటుందో ? లేదో ?? అన్నది మరికొద్దిగంటల్లో తేలనుంది.
ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమంలో సీత గురించి ఓ ఆసక్తికర విషయం తెలిపారు హీరో బెల్లకొండ శ్రీనివాస్. శ్రీనివాస్ ఇప్పటికీ తండ్రి బెల్లంకొండ సురేష్ చాటు కొడుకు అన్న సంగతి తెలిసిందే. తండ్రి ఓకే చేసిన కథలనే శ్రీనివాస్ చేస్తూ వస్తున్నారు. ఐతే తొలిసారి బెల్లకొండ సొంత నిర్ణయం తీసుకొన్నారంట. సీత కథ నాన్నకి నచ్చలేదు. నాకు నచ్చలేదు. తొలిసారి సొంత నిర్ణయం తీసుకొన్నా. ఫలితం ఏమవుతుందో చూడాలన్నారు శ్రీనివాస్.