కేంద్రమంత్రిగా కిషన్ రెడ్డి


తెలంగాణ బీజేపీ నేత కిషన్ రెడ్డి పంటపడింది. ఆయన కేంద్రమంత్రి కాబోతున్నట్టు బీజేపీ వర్గాలు అంటున్నాయి. కేంద్రంలో ఎన్డీయే మరోసారి ఘన విజయం సాధించింది. ఏకంగా 348స్థానాలని గెలుచుకొంది. మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. ఇక,
తెలంగాణలో బీజేపీ అనూహ్యంగా పుంజుకొంది. నాలుగు స్థానాల్లో గెలుపొందింది. సికింద్రాబాద్ స్థానం నుంచి ఆ పార్టీ సీనియర్ నేత కిషన్ రెడ్డి విజయం సాధించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ నుంచి కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డికి అవకాశం దక్కనుందని చెబుతున్నారు.

గత సీజన్ లో తెలంగాణ నుంచి బండారు దత్తాత్రేయ కేంద్రమంత్రిగా వ్యవహరించారు. ఐతే, ఆయన్ని మధ్యంతరంగా మంత్రి పదవి నుంచి తొలగించడంపై తీవ్ర విమర్శలొచ్చాయ్. దీంతో పాటు తెలంగాణలో తెరాసకు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదిగే క్రమంలో ఉన్న నేపథ్యంలో.. ఇక్కడ నుంచి ఒకరిని కేంద్ర మంత్రిగా తీసుకొనే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గెలిచిన నలుగురు తెలంగాణ బీజేపీ నేతల్లో కిషన్ రెడ్డి సీనియర్. అనుభవజ్ఝుడు. మోడీకి మంచి మిత్రుడు కూడా. అందుకే ఆయన కేంద్ర మంత్రి కావడం ఖాయం అంటున్నారు. దీనిపై వారంరోజుల్లోనే క్లారిటీ రానుంది. ఇక, ఈనెల 29న మోడీ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.