కాలేజీలో ‘మహర్షి’ (వీడియో)


సూపర్ స్టార్ మహేష్ బాబు ‘మహర్షి’గా మెగా బ్లాక్ బస్టర్ హిట్ అందుకొన్నారు. ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకుడు. పూజాహెగ్డే కథాయిక. అల్లరి నరేష్ కీలక పాత్రలో నటించారు. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చి పెద్ద విజయాని నమోదు చేసింది. అంతకుమించి అభిమానులు, మహేష్ గర్వపడేలా చేసింది. సినిమా రిలీజ్ తర్వాత మహర్షి సెలబ్రేషన్స్ కొనసాగాయి. ఇందులో భాగంగా మహర్షి చిత్రబృందం స్కూల్స్, కాలేజీల సందర్శన చేసింది. హైదరాబాస్ సీఎంఆర్ కాలేజీలో మహేష్ సందడి చేశారు.

విద్యార్థులు అడిగిన ప్రశ్నకు సరదా సమాధానాలు ఇచ్చారు. దానికి సంబంధించిన పూర్తి వీడియోని చిత్రబృందం విడుదల చేసింది. ఈ కార్యక్రమానికి మంత్రి మల్లారెడ్డి కూడా హాజరయ్యారు. మహేష్ తో ఆయన చేసిన హంగామా ఏంటీ ? విద్యార్థులు మహేష్ని ఏయే ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు తెలుసుకొనేందుకు.. ఈ వీడియోని మీరు చూడండీ.. !