అద్వానీని కలిసిన మోడీ
కేంద్రంలో మరోసారి కమలం వికసించింది. ఎన్డీయే కూటమి ఏకంగా 348స్థానాలని గెలుపొందింది. ఈ నేపథ్యంలో మరోసారి ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమణాస్వీకారం చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సాయంత్రం కేంద్ర కేబినేట్ భేటీ కానుంది. ఈ భేటీలో 16వ లోక్ సభ రద్దుపై నిర్ణయం తీసుకోనున్నారు. ఈ నెల 26న బీజేపీ పార్లమెంటరీ బోర్డ్ బేటీకానుంది. ఈ సమావేశంలో సభాపక్ష నేతన్ని ఎన్నుకోనున్నారు. ఇక, ఈ నెల 29న మోడీ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.
ఘన విజయం నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ, ఇతర ముఖ్య నేతలు పార్టీ ముఖ్య నేతలని కలవబోతున్నారు. ఇందులో భాగంగా ముందుగా అగ్రనేత అద్వానీని కలిశారు. మోడీ, అమిత్ షా ఇద్దరు కలిసి అగ్రనేతని కలిశారు. వీరిద్దరి మధ్య ఎలాంటి చర్చలు జరిగాయన్నది ఆసక్తిగా మారింది. ఇక, ప్రధాని మోడీ ఆయన తల్లిని కలవబోతున్నారు. తల్లి ఆశీర్వాదం తీసుకోనున్నారు. మరోసారి సంపూర్ణ మెజారిటీ అధికారంలోకి వచ్చిన బీజేపీ.. దేశం అభివృద్ది పరుగులు తీసే విధంగా పాలన చేయబోతున్నట్టు సమాచారమ్.