‘సీత’ ట్విట్టర్ రివ్యూ – వన్ ఉమెన్ షో


తేజ దర్శకత్వంలో కాజల్ టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘సీత’. బెల్లకొండ శ్రీనివాస్ కథానాయకుడుగా, బాలీవుడ్ నటుడు సోనుసూద్ ప్రతినాయకుడుగా నటించారు. ఏకె ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మించింది. టీజర్, ట్రైలర్ లతో ‘సీత’పై ఆసక్తి పెరిగింది. ఈ తరం సీతగా కాజల్ ని బోల్డ్ గా, అగ్రెసివ్ గా చూపించినట్టు కనబడింది. ఈ నేపథ్యంలో సీతని చూసేయాలని జనాలు ఫిక్సైపోయారు.

ఈ నేపథ్యంలో భారీ అంచనాల మధ్య తేజ సీత ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే యుఎస్ లో ప్రీమియర్ షోస్ పడిపోయాయి. దీంతో ట్విట్టర్ వేదికగా సినిమా టాక్ ని పంచుకొంటున్నారు. ‘సీత’ దాదాపు లేడీ ఓరియెంటెడ్ సినిమా అని చెబుతున్నారు. సీతగా కాజల్ వన్ ఉమెన్ షో చేసింది. ఆమె నటన హైలైట్. చాలా వేరిషన్స్ చూపించింది. సినిమా ఫలితం ఎలా ఉన్నా సీత కాజల్ కి మంచి పేరు తీసుకువస్తుందని ట్విట్ చేశారు. సినిమా మొత్తంలో కాజల్ పాత్ర, ఆమె నటన మాత్రమే ఫ్లస్ అని మరికొందరు ట్విట్ చేస్తున్నారు. బెల్లకొండ శ్రీనివాస్ మరోసారి తేలిపోయాడని చెబుతున్నారు. మొత్తంగా సీతపై మిక్సిడ్ టాక్ వినిపిస్తోంది.

సీత ప్లస్ పాయింట్స్ :

* సీత (కాజల్) మాత్రమే

సీత మైనస్ పాయింట్స్ :

* రొటీన్ స్టోరీ

* స్లో నేరేషన్

* బెల్లకొండ శ్రీనివాస్