‘అభినేత్రి2’ ట్రైలర్ టాక్


విజయ్ దర్శకత్వంలో ప్రభుదేవా-తమన్నా జంటగా ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం ‘దేవి’. తెలుగులో ‘అభినేత్రి’గా విడుదలైంది. మంచి విజయాన్ని అందుకొంది. ఇప్పుడీ ఈ హారర్ థ్రిల్లర్ సీక్వెల్ ‘అభినేత్రి2’ రెడీ అయింది. ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేసింది చిత్రబృందం. స్టోరీ లైన్ లీక్ చేయడకుండా నవ్వించి, భయపెట్టే ప్రయత్నం చేశారు. సీక్వెల్ లో హారర్ డబుల్ డోస్ అని ట్రైలర్ తో అర్థమవుతోంది.

ప్రభుదేవాకి ఒకటి కాదు రెండు దెయ్యాలు పట్టాయని ట్రైలర్ లోనే చెప్పించారు. అభినేత్రిలో తమన్నాకి దెయ్యం ఆవహించడం. దాన్ని ఆధారంగా చేసుకొని ఫన్ ని పంచారు. భయపెట్టారు. ఐతే, సీక్వెల్ లో ప్రభుదేవాకి రెండు దెయ్యాలని ఆవహించడం. ఆ సన్నివేశాలు డబుల్ ఫన్, డబుల్ భయపెట్టేలా ఉన్నాయి. అంతేకాదు.. సీక్వెల్ లో తమన్నా గ్లామర్ డోస్ పెంచేసింది. మొత్తంగా.. అభినేత్రి2 ట్రైలర్ స్పైసీగా ఉంది. సినిమా కూడా ఈ రేంజ్ లో ఉంటే సూపర్ హిట్టే.