తెలుగులోనూ విశాల్ టెంపర్ చూపిస్తాడట.. !
కోలీవుడ్ హీరో విశాల్ పెద్ద సాహాసమే చేస్తున్నాడు. విశాల్ హీరోగా ‘టెంపర్’ తమిళ్ రిమేక్ ‘అయోగ్య’ తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘అయోగ్య’ మంచి టాక్ సొంతం చేసుకొంది. టెంపర్ ని మక్కీకి మక్కీ దించేశారు. క్లైమాక్స్ ఒక్కటే మార్చారు. అది తమిళ ప్రేక్షకులకి కనెక్ట్ అయింది. సినిమాకు సూపర్ హిట్ టాక్ దక్కింది.
దాంతో సంతోష పడాల్సిన విశాల్.. ఆయోగ్యని తెలుగులోనూ విడుదల చేసేందుకు ప్లాన్ చేసుకొంటున్నారు. ఇది కచ్చితంగా సాహాసమే. ఎందుకంటే ? ఎన్ టీఆర్ కనిపించన పాత్రలో మరో హీరోని తెలుగు ప్రేక్షకులు చూడలేరు. ఆ పాత్రలో విశాల్ కచ్చితంగా లేలిపోవడం ఖాయం. అయోగ్య తెలుగులో విడుదల చేయమని ముందుగానే విశాల్ తెలిపారు. ఐతే, నిర్మాతల ఒత్తిడి వల్ల అయోగ్యని తెలుగులోకి తీసుకురావడం తప్పడం లేదని తెలుస్తోంది.
నిర్మాత మాల్కాపురం శివ కుమార్ అయోగ్య డబ్బింగ్ రైట్స్ తీసుకున్నారు. జూన్‌లో సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.