ఎన్టీఆర్ సెల్ఫ్ గోల్.. వర్కవుట్ అయింది !

‘యంగ్ టైగర్ ఎన్టీఆర్ సెల్ఫ్ గోల్ ఎందుకు చేసుకొన్నారు’ అన్నదానిపై ప్రముఖ సినీ రచయిత, నటుడు పరుచూరి గోపాలకృష్ణ వివరణ ఇచ్చారు. ‘పరుచూరి పలుకులు’ పేరుతో అలనాటి సినిమా సంగతులతో పాటు, కొత్త దర్శకులు, రచయితలకు ఆన్‌లైన్‌ వేదికగా పాఠాలు చెబుతున్న సంగతి తెలిసిందే. తాజాగా, ఆయన ‘టెంపర్’ సినిమాలోని విషమ పరిస్థితి(క్రైసిస్‌) గురించి స్పందించారు.

హీరో, హీరోయిన్‌ వాళ్ల ఆశయాన్ని వదిలేసేయడమే విషమ పరిస్థితి అని వివరించారు. ‘టెంపర్‌’లో క్రైసిస్‌ పాయింట్‌ వర్కవుట్ అయింది. ‘అమ్మాయిని దారుణంగా అత్యాచారం చేసిన వారికి శిక్షపడాలనే ఉద్దేశంతో ఎన్టీఆర్‌ కూడా ఆ ఘాతుకానికి పాల్పడినట్లు కోర్టులో చెబుతాడు. అప్పుడు ప్రేక్షకుడి గుండె ఝల్లుమంటుంది. ఆ పాయింట్‌తో ప్రేక్షకులు గుండె పిండేసినట్లు అవుతుంది. ఇప్పుడు ఇతనిని ఉరిశిక్ష నుంచి ఎవరు కాపాడతారు. హీరోనే తనకు తాను సెల్ఫ్‌ గోల్‌ వేసేసుకున్నాడు. అన్న అద్భుతమైన క్రైసిస్‌ పాయింట్‌ టెంపర్‌లో మీకు అక్కడ వస్తుంది’ అని వివరించారు.

‘రాజా దిగ్రేట్‌’, ‘ఆర్‌ఎక్స్‌ 100’, ‘అర్జున్‌రెడ్డి’ తదితర చిత్రాల్లోని క్రైసిస్‌ పాయింట్‌ల వర్కవుట్ అయింది. సెల్ఫ్ గోల్ కూడా కరెక్ట్ గా చేసుకోవాలి. లేదంటే దెబ్బపడిపోద్ది. తారక్, రవితేజ, విజయ్ దేవరకొండ, కార్తీకేయ ల సెల్ఫ్ గోల్స్ వర్కవుట్ అయ్యాయన్నది గోపాలకృష్ణ మాటలని బట్టీ అర్థమవుతోంది.. మరీ.. !