కవితని కావాలనే ఓడించారా ?

నిజామాబాద్ లో కవిత ఓటమి వెనక కారణాలు తెరాసని షాక్ కి గురిచేస్తున్నాయి. ఆమెని సొంత పార్టీ నేతలే ఓడించారని చెబుతున్నారు. నిజామాబాద్ లోక్ సభపరిథిలోని ఎమ్మెల్యేలు ఎవరు కవిత గెలుపుకోసం కష్టపడలేదు. వారికి ఆ అవసరం కూడా లేకపోయింది. ఎందుకంటే ? ఇటీవలే అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. గెలిచేశాం అనుకొన్నారు. ఇదీగాక, నిజామాబాద్ రాజకీయాల్లో కవిత అతి ఎక్కువైందని, ఆమెకి చెక్ పెట్టేలాని తెరాస ఎమ్మెల్యేలో ఉంది. దాంతో.. కవిత గెలుపు కోసం గట్టిగా ప్రయత్నించలేదు.

మరోవైపు, నిజామాబాద్ లో బీజేపీ గెలుపున వెనక మున్నురుకాపు కార్డు బాగా పనిచేసింది. మున్నురుకాపు ఓట్లు ఎటు ఒరిగితే వారిదే నిజామాబాద్ లో గెలుపు. ధర్మపురి అరవింద్ మున్నురుకాపు సామాజికవర్గానికి చెందిన వాడు కావడంతో.. ఆ వర్గం ఓట్లని గంపగుత్తులా పడ్డాయి. డీఎస్ కూడా తనయుడు గెలుపుకోసం గట్టిగా ప్రయత్నించారు. కాంగ్రెస్ శ్రేణులని కలిసి తనయుడు ఆశీర్వదించాలని కోరారు. అది వర్కవుట్ అయింది. గ్రామాల్లో ఓటర్లు వన్ సైడ్ గా బీజేపీ వైపు మొగ్గుచూపారు. ఫలితంగా అరవింద్ గెలుపు తథ్యం అయింది.