స్క్రిప్ట్ రెడీ మహేష్.. !


సూపర్ స్టార్ మహేష్26వ చిత్రానికి స్క్రిప్ట్ రెడీ అయింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ 26 తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. గత కొన్నాళ్లుగా అనిల్ స్క్రిప్ట్ పనులతో బిజీగా ఉన్నారు. ఇప్పుడా పనులు పూర్తయ్యాయి. లోకేషన్స్ వేట కూడా ప్రారంభం అయింది. అవి పూర్తికాగానే సినిమాని ప్రారంభించబోతున్నారు. ఇక, ఈ సినిమా కోసం ‘సరిలేరు నీకెవ్వరు’, ‘వాట్సాప్’, ‘రెడ్డిగారి అబ్బాయి’ టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి. ‘రెడ్డిగారి అబ్బాయి’ దాదాపు ఫిక్సయిందని చెబుతున్నారు.

మహేష్26 బలమైన కథతో అనిల్ రావిపూడి మార్క్ కామేడీ టచ్ తో తెరకెక్కనుందని తెలుస్తోంది. ఈ సినిమాతో లేడీ సూపర్ విజయశాంతి రీఎంట్రీ ఇవ్వనుంది. మరో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ కీలక పాత్రలో నటిస్తున్నారు. మహేష్ కి జంటగా రష్మిక మందన జతకట్టనున్నారు. ఈ చిత్రానికి కూడా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. వచ్చే యేడాది సంక్రాంత్రి కానుకగా మహేష్26ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.