సీక్రెట్ : కాజల్, రకుల్ తో చరణ్ రొమాన్స్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ఓ సీక్రెట్ బయటపడింది. ఆయన ఇద్దరు హీరోయిన్స్ ని లైన్ లో పెట్టారట. ఆ ఇద్దరు స్టార్ హీరోయిన్స్ కావడం విశేషం. సమయం చూసుకొని వారితో రొమాన్స్ చేసేందుకు చరణ్ ప్లాన్ చేసుకొన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రామ్ చరణ్ రాజమౌళి ‘ఆర్.ఆర్.ఆర్’లో నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో చరణ్ సినిమా ఉండనుందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుంది.

ఈ సినిమా కోసం హీరోయిన్స్ గా కాజల్, రకుల్ ప్రీత్ సింగ్ లని అనుకొన్నట్టు తెలుస్తోంది. ‘భరత్ అను నేను’ తర్వాత కొరటాల మరో సినిమాని మొదలెట్టలేదు. ఆయన మెగాస్టార్ కోసం వెయిట్ చేస్తున్నారు. ‘సైరా’ తర్వాత కొరటాల దర్శకత్వంలోనే మెగాస్టార్ సినిమా ఉండనుంది. ఇప్పటికే స్క్రిప్ట్ రెడీ అయింది. మెగాస్టార్ సినిమా పూర్తికాగానే.. రామ్ చరణ్ తో కొరటాల సినిమా ఉండబోతుంది.

‘ఆర్.ఆర్.ఆర్’ షూటింగ్ పూర్తయ్యేల్లోగా కొరటాల మెగాస్టార్ సినిమాని పూర్తి చేసి చరణ్ కోసం రెడీగా ఉంటాడట. ఐతే, దాదాపు యేడాది తర్వాత ప్రారంభం కానున్న ఈ సినినిమా కోసం అప్పుడే హీరోయిన్స్ బుక్ అయిపోవడం ఆశ్చర్యాన్ని కలిగించే విషయమే. ప్రస్తుతం కాజల్, రకుల్ ఇద్దరు ఫామ్ లో లేరు. అలాంటి వారిని చరణ్ యేడాది ముందే బుక్ చేసుకోవడం విశేషం.