దర్శకేంద్రుడు రాజీనామా వెనక జగన్ !?
దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు ఎస్వీబీసీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారు. వయోభారం కారణంగా పదవి నుంచి వైదొలగుతున్నట్లు పేర్కొంటూ ఈవో అనిల్ కుమార్ సింఘాల్‌కు లేఖ రాశారు. ఐతే, అసలు కారణం అది కాదని పొలిటికల్ టాక్. దర్శకేంద్రుడు చంద్రబాబు మనిషి. ఏపీలో తెదేపా ఘోర పరాజయం రాఘవేంద్రరావుని బాధించి ఉంటుంది. ఇదీగాక, జగన్ సీఎం అయ్యాక టీటీడీ బోర్డులో భారీ మార్పులు తప్పకపోవచ్చు. అప్పుడు ఎలాగో రాజీనామా చేయకతప్పుదు. అంతకంటే ముందే గౌరవంగా తప్పుకుంటే మంచిదనే అభిప్రాయంతో దర్శకేంద్రుడు రాజీనామా చేశారని చెప్పుకొంటున్నారు.
ఇక, సినిమా విషయానికొస్తే.. ‘ఓం నమో వెంకటేశాయ’ దర్శకేంద్రుడు మరో సినిమా చేయలేదు. దర్శకుడిగా ఆయన రిటైర్డ్మెంట్ ప్రకటించినట్టేనని తెలుస్తోంది. ఐతే, నిర్మాతగా ఓ విన్నూత సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నంలో దర్శకేంద్రుడు ఉన్నట్టు సమాచారమ్. ముగ్గురు దర్శకులు హీరోలుగా రాఘవేంద్రరావు ఓ సినిమాని నిర్మించబోతున్నారు. దానికి మరో దర్శకుడు దర్శకత్వం వహించబోతున్నట్టు తెలుస్తోంది. హీరోలుగా మారబోతున్న ఆ ముగ్గురు దర్శకులు ఎవరు ? దర్శకత్వం వహించబోతున్న నాలుగో దర్శకుడు ఎవరు ? అనేది తెలియాల్సి ఉంది.