సమంత పేరు మారింది

పెళ్లి తర్వాత అమ్మాయిల ఇంటిపేరు మారడం సహజమే. స్టార్ హీరోయిన్ సమంత కూడా పెళ్లి తర్వాత పేరు మార్చుకొంది. సమంత రూత్ ప్రభు కాస్త సమంత అక్కినేని అయ్యింది. ఐతే, ఇప్పుడు మరోసార్ సామ్ పేరు మార్చుకోవడం హాట్ టాపిక్ గా మారింది. ఆమె అక్కినేనికి బదులు బేబి ఉంచింది. బేబీ సమంత అని పెట్టుకొంది. ఈ మేరకు ఆమె ట్విట్టర్ అకౌంట్ లోనూ ‘బేబీ సమంత’ అని పేరు మార్చారు. సమంత నటిస్తున్న తాజా చిత్రం ‘ఓ బేబీ’. నందినిరెడ్డి దర్శకురాలు. ఈ సినిమా ప్రమోషన్ కోసం సామ్ పేరు మార్చుకొంది.

ఇటీవలే విడుదలైన ‘ఓ బేబీ’ టీజర్ కి మంచి స్పందన వస్తోంది. ఇందులో యువతి, మధ్య వయస్కురాలు, ముసలి పాత్రలో కనిపించనుంది. ఈ మూడు ఏజ్ గ్రూపులకి మధ్య కనెక్షన్ వినోదాత్మకంగా ఉండబోతుందని టీజర్ తో అర్థమైంది. ‘నాతో ఎంజాయ్ మెంట్ మాములుగా ఉండదు. మీరే చూస్తారుగా’.. అంటూ టీజర్ తో ఊరించింది సామ్. అది ఏ రేంజ్ లో ఉంటుందనేది సినిమాలో చూడాల్సిందే. త్వరలోనే ఓ బేబీ ప్రేక్షకుల ముందుకు రానుంది.