అలా చేస్తే.. మరో 30యేళ్లు జగన్ నే సీఎం !


ఏపీ ప్రజలు ‘వైకాపా’కి ఘన విజయం కట్టబెట్టారు. ఏకంగా 151స్థానాల్లో వైకాపా అభ్యర్థులని గెలిపించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 30న ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణస్వీకారోత్సవానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఐదేళ్లు మాత్రమే కాదు.. ఏకంగా 30యేళ్లపాటు వైఎస్ జగన్ ఏపీ ముఖ్యమంత్రిగా కొనసాగే అవకాశాలున్నాయని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ అన్నారు.

అందుకోసం ఓ పని చేయాలని సూచించారు. అదేంటంటే ? అవినీతికి వ్యతిరేకంగా కేరళ ప్రభుత్వం చేపడుతున్న చర్యలని జగన్ కూడా అమలు చేయాలి. అలా చేసినట్టయితే.. మరో 30యేళ్లు జగన్ ఏపీ ముఖ్యమంత్రిగా కొనసాగే అవకాశాలున్నాయని ఉండవల్లి అన్నారు. సోమవారం ఆయన రాజమండ్రిలో విలేకరులతో మాట్లాడారు. జగన్ కి శుభాకాంక్షలు తెలిపారు. అదే సమయంలో కొన్ని సూచనలు చేశారు. పోలవరం ప్రాజెక్టుపై జ్యుడీషియల్ బాడీని ఏర్పాటు చేస్తానని జగన్ ప్రకటించడం స్వాగతించదగ్గ పరిణామమని ఉండవల్లి అన్నారు. పోలవరం విషయంలో దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకు వెళ్లాలని సూచించారు.