బ్రేకీంగ్ : జార్ఖండ్ లో మావోయిస్టులు ఘాతుకం.. 11మంది జవాన్లకి గాయాలు
జార్ఖండ్‌లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. సరయ్‌కెల్లాలోని కుచాయ్ ప్రాంతంలో భద్రతాసిబ్బందిని లక్ష్యంగా చేసుకుని ఐఈడీ పేలుడుకు పాల్పడ్డారు. ఈ ఘటనలో 11 మంది జవాన్లు గాయపడ్డారు. ఈ దాడిలో ఝార్ఖండ్ పోలీసు విభాగానికి చెందిన ముగ్గురు, 8 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు గాయపడ్డారు. వీరిని మెరుగైన చికిత్స నిమిత్తం హెలికాప్టర్ సాయంతో రాంచీ ఆసుపత్రికి తరలించారు. మంగళవారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఝార్ఖండ్ పోలీసులు, 209 కోబ్రా బెటాలియన్‌కు చెందిన సిబ్బంది సంయుక్త ఆపరేషన్ నిర్వహిస్తుండగా.. మావోయిస్టులు వీరిపై బాంబు దాడి చేశారు.
8 anti- #Maoists CoBRA commandos and 3 JAP jawan injured during the operation in Saraikela Dist of #Jharkhand. Nambala Keshav Rao aka Basavraju, the supreme commander of the red rebel reportedly sighted In the dist shearing border with #Bengal #Odisha. pic.twitter.com/vsVl4SrMVU
— Aashish (@Ashi_IndiaToday) May 28, 2019