తాత బాధ్యతని తీసుకొన్న తారక్


ఏపీలో టీడీపీ ఘోర పరాజయం నేపథ్యంలో జూ.ఎన్టీఆర్ తెరపైకి వచ్చింది. తెదేపా ఆశాకిరణం తారక్ నే. పార్టీని తిరిగి నిలబెట్టే సత్తా ఆయనకి మాత్రమే ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఐతే, తాత ఎన్టీఆర్ జయంతి సందర్భంగా తారక్ నిజంగానే తొలి బాధ్యతని తీసుకొన్నారు. ఎన్టీఆర్ జయంతి అని తెలిసినా.. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ ని ముస్తాబు చేయలేదు టీడీపీ శ్రేణులు.

పూలమాలలు వేయలేదు. కనీసం ఒక్క ఫ్లెక్సీ కూడా ఏర్పాటు చేయలేదు. సోదరుడు కల్యాణ్ రామ్ తో కలిసి తాతకు నివాళులు అర్పించేందుకు ఎన్టీఆర్ ఘాట్ కు వచ్చిన జూ. ఎన్టీఆర్ ఏర్పాట్లపై అసహనం వ్యక్తం చేశారు. వెంటనే తన మనుషులని పూలమాలలు తెప్పించి అలంకరించారు. ఇకపై తాత బాధ్యతని తానే తీసుకొంటానని అన్నారు.

ఇదే టీడీపీలో తారక్ తీసుకొన్న తొలి బాధ్యత. భవిష్యత్ లో పార్టీని తన ఆధీనంలోకి తీసుకొంటాడని తారక్ అభిమానులు చెప్పుకొంటున్నారు. తారక్ కి చంద్రబాబుకి ఇచ్చిన తొలి అవకాశం ఇదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఎన్నికల్లో ఓటమి చెందినంత మాత్రనా.. ఎన్టీఆర్ ని మర్చిపోతారా ? అని ప్రశ్నిస్తున్నారు. తాత విషయంలో తారక్ తీసుకొన్న నిర్ణయం సరైందని సీనియర్ ఎన్ టీఆర్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా.. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా టీడీపీలో తారక్ తొలి బాధ్యత తీసుకొన్నట్టు అయింది.