సాక్షి ఛానెల్’కు లోకేష్ వార్నింగ్


ఏపీకి కాబోయే కొత్త ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి చెందిన సాక్షి ఛానెల్ కు తెదేపా అధినేత చంద్రబాబు తనయుడు, మాజీ మంత్రి నారా లోకేష్ వార్నింగ్ ఇచ్చారు. ఏపీలో ఘోర ఓటమి తర్వాత చంద్రబాబు, లోకేష్ తొలిసారి బయటకు వచ్చారు. అమరావతిలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఎన్ టీఆర్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకే పార్టీ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఓటమికి కార్యకర్తలు నేతలే బాధులని లోకేష్ అన్నట్టు సాక్షి ఛానెల్ ప్రసారం చేసింది.

దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ ని లోకేష్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. “అబద్ధాల సాక్షి ఇంకా తన బుద్ధి మార్చుకోలేదు.
సాక్షి ఛానెల్ యాజమాన్యానికి హుందాతనం, మీడియా విలువలు లేవనడానికి వారి ఛానెల్ లో నాపై వస్తున్న బ్రేకింగ్ న్యూస్ నిదర్శనం”

“టీడీపీ నేతలు, కార్యకర్తలపై నేను అనుచిత వ్యాఖ్యలు చేశానని వారు చేస్తున్న విషప్రచారానికి ఆధారాలు చూపించాలని ఛాలెంజ్ చేస్తున్నాను. ఇకనైనా తమ వైఖరి మార్చుకోకపోతే పరిణామాఛానెల్లు తీవ్రంగా ఉంటాయి” అంటూ వరుస ట్విట్స్ చేశారు.

వాస్తవానికి సాక్షి ఛానెల్ మాత్రమే ఈ వార్తలని ప్రచారం చేయలేదు. తెలుగు టాప్ టీవీ ఛానెల్స్ అని లోకేష్ వ్యాఖ్యలని బ్రేకింగ్ లో వేశాయి. ఈవీఎంల తప్పిదాలు తెదేపా ఓటమికి పది శాతమే కారణం. చంద్రబాబు ఓటమికి నేతలే కారణం. మంత్రి గంటా గెలవగా లేనిది.. మిగితా నేతలు ఎందుకు గెలవలేదని లోకేష్ అన్నట్టు టీవీ ఛానెల్స్ ప్రసారం చేశారు. మరీ.. దీనిపై లోకేష్ ఏమంటారో ?