‘రణరంగం’పై ప్లాప్ సినిమా ఎఫెక్ట్


సుధీర్ వర్మ దర్శకత్వంలో శర్వానంద్ నటిస్తున్న చిత్రం ‘రణరంగం’. కాజల్, కళ్యాణి ప్రియదర్శిని హీరో హీరోయిన్లు. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ కు మంచి స్పందన దక్కింది. ఇందులో శర్వా మాస్ లుక్ లో కనిపించారు. ఒక గ్యాంగ్‌స్టర్‌ జీవితంలో 1990 మరియు 2000 సంవత్సరాలలో జరిగిన సంఘటనల నేపథ్యంలో ఈ సినిమా ఉండనుందని చెబుతున్నారు. ఈ సినిమా ఆగస్టు 2న రిలీజ్ కానుంది. వాస్తవానికి ‘రణరంగం’ వేసవిలోనే రావాల్సి ఉంది. శర్వానంద్ కారణంగానే సినిమా విడుదలకి ఆలస్యం అయిందని టాక్.

‘ప‌డి ప‌డి లేచె మ‌న‌సు’, ‘ర‌ణ‌రంగం’ షూటింగులు రెండూ స‌మాంత‌రంగా సాగాయి. అయితే `ప‌డి ప‌డి లేచె మ‌న‌సు` ముందే విడుద‌లైంది. ఈ సినిమా ఫ్లాప్‌తో శ‌ర్వా నిరాశ‌కు లోన‌య్యాడ‌ని, అందుకే త‌ర‌చూ `ర‌ణ‌రంగం`షూటింగ్‌కి డుమ్మా కొట్టేవాడ‌ని తెలుస్తోంది. ఈ కారణంగా శర్వాపై నిర్మాత సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ కాస్త గుర్రుగా టాలీవుడ్‌లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఓ సినిమా ఫ్లాప్ అయితే, క‌సిగా రెండో సినిమా చేయాలి. ఆ బాధ‌తో మ‌రో సినిమాని పాడు చేయ‌డం ఎంత వ‌ర‌కూ క‌రెక్ట్ ? ఈ విషయంలో శర్వా కచ్చితంగా మారాల్సిందే.