జగన్ ఎఫెక్ట్ : బాలయ్య సినిమా క్యాన్సిల్ !


ఏపీలో జగన్ యుగం మొదలైంది. ఆయన నేతృత్వంలోని వైకాపా ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. శతాబ్ధాల చరిత్ర కలిగిన టీడీపీని చావుదెబ్బ కొట్టింది. ఈ నేపథ్యంలో ఏపీలో టీడీపీ పనైపోయిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. దానికి భవిష్యత్తుయే సమాధానం చెప్పాలి. ఈ విషయాన్ని పక్కనపెడితే.. జగన్ సీఎం అయ్యాక టీడీపీ నేతల తాట తీస్తారనే ప్రచారం కూడా ఉంది. అంతకంటే ముందే జగన్ ఎఫెక్ట్ బాలయ్య సినిమాపై పడింది. కెయస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న బాలయ్య సినిమా క్యాన్సిల్ అయింది. ఇందుకు జగన్ నే కారణమని చిత్రబృందం నుంచి అందిన సమాచారమ్.

ఈ సినిమాలో జగపతిబాబు విలన్ గా డబుల్ రోల్ చేస్తున్నారు. ఐతే, ఈ డబుల్ రోల్ లో జగపతిబాబు తాత, మనవడిగా కనిపిస్తారని తెలుస్తోంది. ఫ్లాష్ బ్యాక్ లో తాత విలన్. తరువాత మనవడు విలన్. ఈ రెండు విలన్ క్యారెక్టర్లు కూడా వైఎస్ రాజారెడ్డి, వైఎస్ జగన్ లు స్ఫురించేలా రాసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే సినిమా రద్దయినట్టు తెలిసింది. ఏపీకి కొత్త సీఎం గా జగన్ రేపు ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఇలాంటి టైమ్ లో ఇలాంటి కథతో సినిమా తీస్తే, వ్యవహారం తేడాగా వుంటుంది. బాలయ్య వైసీపీలో చేరారనే ప్రచారం కూడా మొదలవుతోంది. ఇది చాలా రిక్స్ అని రవికుమార్ సినిమాని బాలయ్య పక్కన పెట్టేశారని టాక్.

కెయస్ రవికుమార్ సినిమా క్యాన్సిల్ కావడంతో బోయపాటి లైన్ లోకి వచ్చేశారు. త్వరలోనే బాలయ్య-బోయపాటి కాంబోలో హ్యాట్రిక్ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. జులై ఈ సినిమా ప్రారంభోత్సవం కాబోతున్నట్టు సమాచారమ్. ఇది నందమూరి అభిమానులకి గుడ్ న్యూసే. ఎందుకంటే ? బాలయ్య అభిమానులకి కెయస్ రవికుమార్ పై పెద్దగా నమ్మకం లేదు. ఆల్రెడీ బాలయ్యకు రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన బోయపాటి సినిమా కోసమే వాళ్లు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.