మహేష్ సినిమాకు కొరటాల నిర్మాత ?

సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేసేందుకు గీతా ఆర్ట్స్ ఏర్పాట్లు చేసుకొంటోంది. చాన్నాళ్లుగా మహేష్ కోసం కథని రెడీ చేయించే పనిలో ఉంది. చాలామంది దర్శకులని అనుకొన్నా.. ఫైనల్ గా పరశురామ్ చేసిన కథని ఓకే చేశారు. త్వరలోనే పరశురామ్ మహేష్ కి కథని వినిపించనున్నాడు. మహేష్ ఓకే అంటే.. సినిమాని అధికారికంగా ప్రకటించనున్నారు. ఐతే, ఈ సినిమాని నిర్మించేందుకు దర్శకుడు కొరటాల శివ పోటీపడుతుండటం విశేషం.

నిర్మాతగా మారేందుకు కొరటాల ఏర్పాట్లు చేసుకొంటున్నారు. కొరటాల శివ తన స్నేహితుడు మిక్కిలినేని సుధాకర్ తో కలిసి సుధా ఆర్ట్స్ బ్యానర్ పై మహేష్27 సినిమాని భావిస్తున్నాడు. కొరటాల అడిగితే మహేష్ కాదనడు. ఈ నేపథ్యంలో గీతా ఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కాల్సిన మహెష్ సినిమాని కొరటాల హైజాక్ చేసేలా కనిపిస్తున్నాడు. ఫైనల్ గా మహేష్27ని ఎవరు నిర్మిస్తారన్నది చూడాలి.