రాజ్ తరుణ్ ప్రేమ పెళ్లి
టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ పెళ్లి ప్రకటన చేశారు. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్టు ట్విట్ చేశారు. అది కూడా ప్రేమ వివాహం. ఐతే, ఆ అమాయి ఎవరు ? అన్నది మాత్రం చెప్పలేదు. మంగళవారం రాజ్ తరుణ్ ట్విట్టర్ లో అభిమానులతో కాసేపు ముచ్చటించారు. వారు అడిగిన ప్రశ్నలకి సరదాగా సమాధానం చెప్పారు.
ఓ అభిమాని మీరు ప్రేమ వివాహం చేసుకోతున్నట్టు తెలిపారు. ఎప్పుడు మీ క్వీన్ పరిచయం చేయబోతున్నారని ప్రశ్నించారు. దానికి అతి త్వరలోనేనని సమాధానం ఇచ్చారు రాజ్ తరుణ్. దీంతో ఈ యేడాదియే రాజ్ తరుణ్ ఓ ఇంటివాడు కాబోతున్నాడని తేలిపోయింది. ఇంతకీ రాజ్ తరుణ్ ప్రేమించింది హీరోయిన్ నా ? లేక మరో అమ్మాయినా ?? అన్నది తెలియాల్సి ఉంది.
Very soon 🙂 https://t.co/jZDHmfmaSU
— Raj Tarun (@itsRajTarun) May 27, 2019