ఫిట్ నెస్ పై రకుల్ బోల్డ్ కామెంట్స్


స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ నాజుకుతనం గురించి తెలిసిందే. పాప ఫిట్ గా ఉంటుంది. అందుకోసం జిమ్ లో గంటలు తరబడి గడుపుతుంటుంది. ఆమె ఫిట్ నెస్ బిజినెస్ కూడా చేస్తోంది. హైదరాబాద్ లో జిమ్ ని నడుపుతోంది. ఈ విషయం పక్కనపెడితే.. మంగళవారం హైదరాబాద్ లో జరిగిన ‘ఎన్ జీకే’ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ లో రకుల్ ని ప్రశ్నించే అవకాశం ఓ ఫ్యాన్ కు దక్కింది.

మీరు చాలా ఫిట్ గా కనిపిస్తారు. ఎప్పుడు చూసిన అదే ఫిజిక్. అదే ఫిటినెస్ తో కనిపిస్తున్నారు. మీ ఫిట్ నెస్ సీక్రెట్ ఏంటీ ? అని ప్రశ్నించింది. ఓ అమ్మాయి. దీనికి రకుల్ కాస్త బోల్డ్ గా సమాధానం ఇచ్చింది. “ఇప్పుడు ఇలాంటి బట్టలు వేసుకొని డ్యాన్స్ చేయాలంటే కొంచెం ఫిట్ గా ఉండాలి కదా. మళ్లీ ఇక్కడి నుంచి ఎక్కడి నుంచి ఫ్యాట్ ఉంటే బాగుండదు. అది నా ప్రొఫెషన్ డిమాండ్. అది నా జాబ్. బాగా కనిపించడానికి ప్రయత్నిస్తా’ అన్నారు రకుల్. అది నిజమే.. నాజుకు నడుము అందాలు చూపిస్తేనే మజా కదా.. !