మెగాస్టార్ కోసం ఇద్దరు హీరోయిన్స్.. ఫిక్స్ !


మెగాస్టార్ చిరంజీవితో సినిమా ఏర్పాట్లని చేసుకొంటున్నారు దర్శకుడు కొరటాల శివ. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతోంది. ఇందులో భాగంగా ముందుగా హీరోయిన్స్ ఎంపిక చేసినట్టు తెలిసిందే. మెగాస్టార్ కోసం ముందుగా శృతిహాసన్, నయనతార, తమన్నా.. పేర్లు వినిపించాయి. తాజాగా జెర్సీ హీరోయిన్ శ్రద్దా శ్రీనాథ్ పేరు తెరపైకి వచ్చింది.

‘జెర్సీ’ సినిమా చూసి.. శ్రద్దా శ్రీనాథ్ నటనకి కొరటాల ఫిదా అయ్యాడట. అందుకే మెగాస్టార్ సినిమా కోసం ఆమెని ఏరికోరి తీసుకొన్నట్టు తెలుస్తోంది. అంతేకాదు.. సినిమాలో మరో హీరోయిన్ కి అవకాశం ఉందట. ఆ ఛాన్స్ మిల్కీ బ్యూటీ తమన్నాకి దక్కినట్టు తెలుస్తోంది. ‘రచ్చ’ సినిమా ఫంక్షన్ లో తనకి తమన్నాతో కలిసి నటించాలని ఉందని మెగాస్టార్ అన్న సంగతి తెలిసిందే.

ఇప్పుడా కోరికని తీర్చుకోబోతున్నాడు. తమన్నాతో రొమాన్స్ చేయబోతున్నాడు మెగాస్టార్. మెగాస్టార్ పక్కన తమన్నా పెద్దగా షాక్ ఇచ్చే విషయమేమీ కాదు. కానీ, శ్రద్దా కపూర్ కి చిరుతో కలిసి నటించే ఛాన్స్ ఇంత త్వరగా రావడం గొప్ప విషయమని చెప్పవచ్చు. ఇక, త్వరలోనే కొరటాల-చిరు సినిమా ప్రారంభం కానుంది. వచ్చే యేడాది సంక్రాంత్రి కి సినిమాని తీసుకొచ్చే ప్లాన్ ఉన్నారు.