ప్రధాని మోడీ తల్లి ప్రేమ చూశారా.. ?
ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రధానిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో ప్రధాని ప్రమాణస్వీకారోత్సవం ఘనంగా జరిగింది. దేశ-విదేశాల నుంచి అతిథులు హారజయ్యారు. ప్రధాని నరేంద్ర మోడీ తల్లి మాత్రం ఇంట్లో టీవీల్లో కొడుకు ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తుంటే.. ఆనందంతో చప్పట్లు కొడుతూ మురిసిపోయింది. దానికి సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇక ప్రధాని ప్రమాణస్వీకారం తర్వాత మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. కేంద్రమంత్రులుగా రాజ్ నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, కిషన్ రెడ్డి, అమిత్ షా.. తదితరులు ప్రమాణ స్వీకారం చేశారు. మోడీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి బిమ్‌స్టెక్ దేశాల ప్రతినిధులు, శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన, మయన్మార్ అధ్యక్షుడు యూ విన్ మైంట్, నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి, బంగ్లాదేశ్ అధ్యక్షుడు అబ్దుల్ హమీద్, ఉపరాష్ర్టపతి వెంకయ్యనాయుడు దంపతులు, బీజేపీ అగ్ర నాయకులు ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ, శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే తదితరులు హాజరయ్యారు