‘గేమ్ ఓవర్’ ట్రైలర్ టాక్


తాప్సీ బాలీవుడ్ లో సెట్టైపోయింది. అక్కడ విజయాలతో పాటు మంచి పేరుని కూడా తెచ్చుకొంది. అయినా.. తెలుగు ప్రేక్షకులతో టచ్ లోనే ఉంటుంది. వీలు చూసుకొని తెలుగు సినిమా చేస్తోంది. ఆమె నటించిన ‘గేమ్ ఓవర్’ జూన్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి అశ్విన్ శరవణ్ దర్శకత్వం వహించారు. వైనాట్‌ స్టూడియోస్‌ సంస్థ నిర్మిస్తోంది.

ఈ సినిమా ట్రైలర్ ని మంగళవారం రానా దగ్గుపాటి చేతుల మీదుగా విడుదల చేశారు. స్టోరీ లైన్ ని లీక్ చేయకుండా భయపెట్టే సన్నివేశాలతో ట్రైలర్ ని కట్ చేశారు. తాప్సి భయంకరంగా అరుస్తున్న సన్నివేశాలతో ట్రైలర్‌ మొదలైంది. ఆమెను ఎవరో హత్య చేయడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ ఆ వ్యక్తి ఎవరో కనిపించడు. ‘దీనిని యానివర్సరీ రియాక్షన్‌ అంటారు. ప్రతి సంవత్సరం, ఒకే టైంలో ఒకే ఆలోచన గుర్తుకువస్తూ ఉంటుంది. అందరికీ ఒకసారి లైఫ్‌లో ఇలాంటి పరిస్థితి వస్తుంది’ అని నటుడు అనీశ్‌ కురువిల్ల తాప్సికి నచ్చజెప్తుంటారు. గేమ్ భయపెట్టేలా ఉంది. ఐతే, ఆ గేమ్ ని ఎలా డిజైన్ చేశారన్న దానిపై ఫలితం ఆధారపడి ఉండనుంది.